మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (17:46 IST)

చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది.. తక్షణం అరెస్టు చేయాలి : విజయసాయి రెడ్డి

vijayasai reddy
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది అని, ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని వైకాపా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మాండ్ చేశారు.
 
మంగళవారం చిదంబరంతో పాటు.. ఆయన తనయుడు కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ సోదాలు జరిపిన విషయం తెల్సిందే. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కార్తీ చిదంబరం భారీ మొత్తంలో విదేశాలకు సొమ్ములు చేరవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. 
 
ఈ దాడులపై విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది. ఆయనకు నైతికతే లేదు. న్యాయ కళాశాలలు చిదంబరం వ్యవహారాలను కేస్ స్టడీలుగా తీసుకోవాలి. మనీ లాండరింగ్ నుంచి చైనా పౌరులకు లంచాలు తీసుకుని చిదంబరం వీసాలు ఇప్పించారు. ఐపీసీలోని అన్ని రకాల సెక్షన్లకు సరిపోయే నేరాలకు చిదంబరం పాల్పడ్డారని, అందువల్ల ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలి" అని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.