ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (15:18 IST)

మెట్లపై నుంచి జారిపడిన లాలూ ప్రసాద్ యాదవ్ - భుజం విరిగింది

lalu prasad yadav
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ ఇంట్లోని మెట్లపై నుంచి జారిపడ్డారు. దీంతో ఆయన భుజం ఎముక విరిగింది. ఆదివారం ఈ సంఘటన జరిగింది. దీంతో ఆయన్ను పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
74 యేళ్ళ లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పైగా, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ యేడాది మొదట్లో డిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. దాణా స్కామ్‌లో దోషిగా తేలడంతో మొదట్లో 2017 డిసెంబరు నెలలో ఆయనకు జైలుశిక్ష ఖరారైంది. 
 
ఈ ఏప్రిల్ నెలలో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన పాట్నాలోని తన నివాసంలోనే ఉంటూ, ఆదివారం మెట్లపై నుంచి జారి పడ్డారు. దాంతో భుజం ఎముక విరగడంతో పాటు వెన్నెముకకు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.