శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (13:26 IST)

హాస్పిటల్ బెడ్‌లకు కూడా జీఎస్టీ ... కేంద్రం బాదుడు

beds
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన "ఒకే దేశం ఒకే పన్ను చట్టం" ఇపుడు దేశ ప్రజల నడ్డివిరిస్తుంది. చివరకు ఆస్పత్రి పడకలపై కూడా పన్ను వసూలు చేయనున్నారు. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.5 వేలకు పైగా చార్జీ ఉండే పడకలపై ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్ సదుపాయాతం లేకుండా పన్నును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఇది భారం మోపుతుందని, నాణ్యమైన దూరం చేయడం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, దేశంలో హెల్త్‌కేర్ సేవలను జీఎస్టీ కిందకు తీసుకునిరావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రెండు రోజుల క్రితం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కౌన్సిల్ నిర్ణయం మధ్యతరగతి ప్రజలపై పెనుభారం చూపుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రుల ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు.