శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (12:22 IST)

అమ్మ సమాధిపై శశి ''శపథం'': పన్నీర్ సెల్వమే టార్గెట్.. సీఎం పదవి కూడానా? ఏమై వుంటుంది?

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల తీర్పుతో జైలు శిక్ష అనుభవించేందుకు బుధవారం నాడు బెంగళూరు బయలుదేరారు. పోయెస్ గార్డెన్ నుంచి రోడ్డు మార్గంలో కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరా

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల తీర్పుతో జైలు శిక్ష అనుభవించేందుకు బుధవారం నాడు బెంగళూరు బయలుదేరారు. పోయెస్ గార్డెన్ నుంచి రోడ్డు మార్గంలో కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరారు. బెంగళూరుకు బయల్దేరే ముందు శశికళ అమ్మ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అమ్మ సమాధిపై శపథం కూడా చేసారు. 
 
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ, దినకరన్, ఇళవరసిలకు సుప్రీం కోర్టు మంగళవారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే తనకు కోర్టులో లొంగిపోయేందుకు నాలుగు వారాల సమయం కావాలని శశికళ కోరింది. సుప్రీం కోర్టు గడువు ఇచ్చేందుకు నిరాకరించింది.
 
ఈ నేపథ్యంలో బుధవారం ఆమె బెంగళూరుకు బయలుదేరారు. రోడ్డు మార్గంలో ఆమె బయలుదేరారు. కాగా, అక్రమాస్తుల కేసులో శశికళ, ఆమె ఇద్దరు బంధువులకు ఒక్కొక్కరికి నాలుగేళ్ల కారాగార శిక్ష, రూ.10 కోట్లు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు 2014లో తీర్పునిచ్చింది. అప్పట్లో జయలలితకు నాలుగేళ్ల జైలు, రూ.100 కోట్ల జరిమానా విధించింది.
 
ఈ నేపథ్యంలో తీర్పు వెలువడిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ శశికళకు బాసటగా నిలిచింది. జయలలిత భారాన్ని ఆమె ఎప్పుడూ తనపై వేసుకునేవారనీ, ఇప్పుడూ అదే చేస్తున్నారనీ పార్టీ ట్విటర్‌ ఖాతా ద్వారా పేర్కొంది. అయితే అమ్మ సమాధిపై శశికళ చేసిన శపథం ఏమిటనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అమ్మపై శపథం చేసి చిన్నమ్మ జైలుకెళ్తే.. పన్నీర్ సెల్వం పరిస్థితి ఏంటి.? ఆయన్ని టార్గెట్ చేసుకునే చిన్నమ్మ శపథం చేసిందా? లేకుంటే కచ్చతంగా సీఎం పదవి కైవసం చేసుకుంటానని శపథం చేసిందా అని చర్చించుకుంటున్నారు.