గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (13:59 IST)

చంద్రుడికి తప్పిన ముప్పు.. రాకెట్ శకలం అలా దూసుకుపోయింది..

చంద్రుడికి అంతరిక్ష వ్యర్థాల నుంచి పెను ముప్పు తప్పింది. అంతరిక్షంలో తిరుగుతున్న ఒక రాకెట్ శకలం చంద్రుడికి అత్యంత సమీపం నుంచి వెళ్లడంతో గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది. అది వెళ్లిన వేగానికి చంద్రుడిపై కొన్ని వందల కిలోమీటర్ల మేర ధూళి పైకెగిసింది. 
 
వందల కిలోమీటర్ల మేర ధూళి ఎగియడంతో సైంటిస్టులు అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత రాకెట్ శకలం దూసుకుపోయినట్టు గుర్తించారు. చంద్రుడి చుట్టూ దాదాపు మూడు టన్నుల వ్యర్థాలు ఓ గోడలా పేరుకుపోయి ఉన్నాయి. 
 
ఈ శకలం దూసుకొచ్చిన వేగానికి ఆ గోడకు 33 అడుగుల నుంచి 66 అడుగుల లోతైన బిలం ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం చైనా ప్రయోగించిన రాకెట్ శకలంగా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు.