మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (10:42 IST)

వెనక్కి తగ్గని ఎయిరిండియా.. రైలులో ముంబైకు చేరుకున్న రవీంద్ర గైక్వాడ్

ఎయిరిండియా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ సిబ్బందిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పట్ల ఎయిరిండికా కఠినంగా వ్యవహరిస్తోంది. విమానాల్లో ప్రయాణించేందుకు ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ఆ

ఎయిరిండియా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ సిబ్బందిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పట్ల ఎయిరిండికా కఠినంగా వ్యవహరిస్తోంది. విమానాల్లో ప్రయాణించేందుకు ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ఆయన ఢిల్లీ నుంచి ముంబైకు రైలులో ప్రయాణిస్తున్నారు. 
 
గైక్వాడ్‌పై గతనెల 23న ఎయిరిండియా నిషేధం విధించిన విషయం తెల్సిందే. పార్లమెంట్ సమావేశాలకు స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లిన ఆయన ఇంతవరకు సాధారణ పాసింజర్ విమానాల్లో ప్రయాణించలేదు. పార్లమెంట్ చర్చ అనంతరం క్షమాపణలు చెబుతూ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు లేఖ రాశారు. దీంతో ఆయనపై నిషేధాన్ని ఎయిరిండితో పాటు పలు విమానయాన సంస్థలు ఎత్తివేశాయి. కానీ, నిఘా మాత్రం కొనసాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో.. ఆయన ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రేను కలిసేందుకు ఢిల్లీ నుంచి ముంబైకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చేరుకున్నారు. కాగా, నిషేధం ఎత్తివేసిన అనంతరం ఎయిరిండియా సిబ్బంది పిచ్చివాళ్లంటూ ‌ఆయన మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.