శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 15 జులై 2021 (09:12 IST)

రాష్ట్రపతి రేసులో లేను : శరద్‌ పవార్‌

రాష్ట్రపతి రేసులో తాను లేనని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్‌పవార్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా శరద్‌ పవార్‌ బరిలోకి దిగుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

ప్రశాంత్‌ కిషోర్‌తో జరిగిన సమావేశాల్లో రాజకీయ చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. శరద్‌పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఇటీవల రెండు సార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనని ఆయన చెప్పారని అన్నారు.