శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (13:44 IST)

రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేను : స్పష్టతనిచ్చిన శరద్ పవార్

sarad pawar
వచ్చే నెలలో దేశ ప్రథమ పౌరుడు (రాష్ట్రపతి) ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే నెల 24వ తేదీతో ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఈలోగానే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సివుంది.

ఈ పరిస్థితుల్లో విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ నేత, కురువృద్ధ రాజకీయ నేత శరద్ పవార్ పేరు తెరపైకి వచ్చింది. వదీంతో ఆయన ఖచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా విపక్షాల తరపున పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
 
ఈ ప్రచారానికి ఆయన మంగళవారం ఫుల్‌స్టాఫ్ పెట్టారు. రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనని స్పష్టంచేశారు. అత్యున్నత పదవి కోసం విపక్షాల తరపు అభ్యర్థిని తాను కాదని చెప్పారు. ముంబైలో ఎన్సీపీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. 
 
నిజానికి విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలన్న ప్రతిపాదనను శరద్ పవార్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉంచింది. అయితే, ప్రస్తుతం పరిస్థితుల్లో ఉమ్మడి అభ్యర్థిని సులభంగా గెలిపించుకునే స్థాయిలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ప్రతిపక్షాలకు లేపు. ఈ కారణంగానే ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.