సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

పవర్‌పై అనుచిత వ్యాఖ్యలు - మరాఠా నటి అరెస్టు

Ketaki Chitale
ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత శరద్ పవార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మరాఠా నటి కేతకి చితాలే (29)ను పోలీసులు అరెస్టు చేశారు. కేతకి చేసిన పోస్టుపై స్వప్నిల్ నెట్కే థానేలోని కల్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, శుక్రవారం ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్టును షేర్ చేశారు. అందులో శరద్ పవార్ ఇంటి పేరును, వయస్సును ప్రస్తావిస్తూ "నరకం వేచి చూస్తుంది. బ్రహ్మణులను మీ అసహ్యించుకుంటున్నారు" అని పేర్కొంది. అందులో శరద్ పవార్ పేరును పవార్ అని మాత్రమే ప్రస్తావించిన కేతకి.. వయసు 80 అని పేర్కొంది. అయితే, శరద్ పవార్ వయసు ప్రస్తుతం 81 యేళ్లు. 
 
ఇదిలావుంటే, నవీ ముంబైలోని కలంబొలి పోలీస్ స్టేషన్ బయట చితాలేపై ఎన్సీపీ మహిళా విభాగం కార్యకర్తలు నల్ల ఇంకు, కోడిగుడ్లతో దాడి చేశారు. అలాగే, పూణెలోనూ ఎన్సీపీ కార్యకర్తల ఫిర్యాదుతో కేతకిపై కేసు నమోదు చేశారు.