గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (11:39 IST)

మణిపూర్‌లో నగ్నంగా ముగ్గురు మహిళలు- 19 ఏళ్ల అమ్మాయిపై..?

woman
ముగ్గురు మహిళలను వివస్త్రగా మార్చారు. 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారాన్ని సోదరుడు అడ్డుకోగా అతన్ని చంపేసిన ఘటన మణిపూర్‌లో చోటుచేసుకుంది. అనంతరం ఆమెను ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారం చేసింది. ఘటన తర్వాత ఆమె తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ వీడియో సోషల్ మీడియాలో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మణిపూర్ ఘటన నిజంగా సిగ్గు చేటు అని అన్నారు. ఒక గ్యాంగ్ ముగ్గురు మహిళలను వివస్త్రను చేశారు. ఈ ఘటనకు ముందు రోజు జరిగిన అల్లర్ల తర్వాత ఐదుగురు వ్యక్తులు అపహరణకు గురయ్యారు.
 
పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. ముందు ఈ గ్యాంగ్ ఒక వ్యక్తిని చంపి ముగ్గురు మహిళలను వివస్త్రలను చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఆ తర్వాత 19 ఏళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. అయితే మే 4న ఫిర్యాదు చేస్తే.. జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ నేరస్తులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు.
 
ఈ దారుణం జరిగిన రెండు నెలల తర్వాత వీడియో బయటకు రావడంతో మణిపూర్ కొండ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన మే 4న కంగ్పోక్పి జిల్లాలో చోటుచేసుకుంది.