బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మే 2024 (09:37 IST)

ఢిల్లీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - ప్రాణాలు నవజాత శిశువులు

Woman Fire
ఢిల్లీలోని ఓ చిన్నారుల ఆస్పత్రిలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. వివేక్ నగర్‌లోని న్యూబార్న్ బేబీ కేర్‌ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం నుంచి 12 మంది చిన్నారులను రక్షించినట్టు అగ్నిమాపకదళ సిబ్బంది వెల్లడించారు. అయితే, వీరిలో ఆరుగురు మరణించగా మిగతా వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరికి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. చిన్నారులకు ఈస్ట్ ఢిల్లీ ఎడ్వాన్స్ ఎన్.ఐ.సి.యు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. 
 
శనివారం రాత్రి 11.32 గంటలకు ఫైర్ కంట్రోల్ రూంకు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం గురించి తెలిసిపోతుందని పోలీసులు తెలిపారు. మొత్తం 16 అగ్నిమాపక వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పివేశాయి. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌ నగరంలోని గేమ్ జోన్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఏకంగా 27 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.