శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (09:30 IST)

మరికొన్ని క్షణాల్లో వివాహం... అంతలోనే వధువును వెంటాడిన మృత్యువు

బెంగుళూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. మరికొన్ని క్షణాల్లో మెడలో మూళ్లు వేయించుకోవాల్సిన ఓ వధువు.. మృత్యుఒడిలోకి జారుకుంది. దీంతో ఇరు కుటుంబాల వెంట విషాదం నెలకొంది. గురువారం జరిగిన ఈ విషాద సంఘటన వ

బెంగుళూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. మరికొన్ని క్షణాల్లో మెడలో మూళ్లు వేయించుకోవాల్సిన ఓ వధువు.. మృత్యుఒడిలోకి జారుకుంది. దీంతో ఇరు కుటుంబాల వెంట విషాదం నెలకొంది. గురువారం జరిగిన ఈ విషాద సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగుళూరు నగరానికి చెందిన దివ్య (20), హరీశ్‌ అనే యువతీ యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారిద్దరికి వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో వారి వివాహం గురువారం ఉదయం ధర్మస్థలంలో జరగాల్సి ఉంది. ఇందుకోసం వధూవరులు సహా ఇరు వర్గాల బంధుమిత్రులు ఒక టెంపోలో బయలుదేరారు.
 
అయితే మార్గమధ్యలోనే వీరు ప్రయాణిస్తున్న టెంపో వ్యాన్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వధువుతో సహా 8 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో వధువు దివ్య (20), డ్రైవర్ నాగప్ప గణిగార్(45), టెంపోలో ఉన్న పాలాక్షి(42), బేబి(38), సుబ్రహ్మణ్య(15), రుక్మిణి(65)లు ఉన్నారు.