గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 జులై 2020 (09:50 IST)

విమాన ప్రయాణీకులకు స్వల్ప వెసులుబాటు

విమాన ప్రయాణీకులకు పౌర విమానయాన శాఖ స్వల్ప వెసులుబాటు కలిగించింది. ప్రయాణ తేదీకి ముందు మూడు వారాల వ్యవధిలో తమకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రాలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేస్తే చాలు.. వారిని విమానం ఎక్కడానికి అనుమతిస్తారు.
 
కరోనా బారినపడి కోలుకున్నవారికీ ఈ వెసులుబాటు ఉంటుంది. వారు కొవిడ్‌కు చికిత్స తీసుకున్నట్లు ఆసుపత్రి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది.

గతంలో ప్రయాణ తేదీకి ముందు రెండు నెలల వ్యవధిలో కరోనా పాజిటివ్‌ రాలేదని ప్రయాణికులు స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉండేది.