సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జులై 2020 (19:01 IST)

భార్యను చంపేశాడు... మామ జననాంగాలు కోసేసిన అల్లుడు.. ఎక్కడ?

వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణం జరిగింది. భార్యను చంపేసిన ఓ భర్త... ఆ తర్వాత పిల్లనిచ్చిన మామ జననాంగాలను కోసేశాడు. ఈ ఘటన ప‌శ్చిమ బెంగాల్ సోనాపూర్ లోని సుభాష్ గ్రామ్ ఏరియాలో శ‌నివారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బ‌సుదేవ్ గంగూలీ(76)కి సుమిత పండిట్ అనే కూతురు ఉంది. గంగూలీ సుమిత‌కు పెంపుడు తండ్రి. అయితే సుమిత‌ను ర‌మేశ్ అనే వ్య‌క్తికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే రమేశ్ గ‌త కొంత‌కాలం నుంచి ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్నాడు.
 
ఈ క్ర‌మంలో ర‌మేశ్, సుమిత మ‌ధ్య శుక్ర‌వారం రాత్రి తీవ్ర ఘ‌ర్ష‌ణ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి లోనైన ర‌మేశ్.. సుమిత‌, బ‌సుదేవ్‌పై క‌త్తితో దాడి చేశాడు. సుమిత ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిపోయింది. బ‌సుదేవ్ జ‌న‌నాంగాల‌ను ర‌మేశ్ కోసేసి ప‌రారీ అయ్యాడు.
 
అయితే ఆదివారం బ‌సుదేవ్ నివాసంలో ఉన్న పూల‌ను కోసేందుకు పొరుగింటి వారు రావ‌డంతో మృత‌దేహాలు క‌న‌బ‌డ్డాయి. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న తండ్రికుమార్తెల మృత‌దేహాల‌ను చూసి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పరారీలో ఉన్న రమేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.