మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శుక్రవారం, 10 జులై 2020 (16:25 IST)

యజమాని భార్యను లైన్లో పెట్టాడు, అడ్డుగా ఉన్న యజమానిని?

సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామశివారులో అర్థరాత్రి అలజడి. ఒక వ్యక్తిని అతి దారుణంగా కత్తులతో నరికి చంపేశారు. ఘటనా స్థలంలో ఎవరూ లేరు. స్థానికుల సమాచారంతో పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. సరిగ్గా 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు.
 
పోలీసుల విచారణలో ఆశ్చర్యపోయే నిజాలు బయటకు వచ్చాయి. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్యే భర్తను హత్య చేయించిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇల్లంతుకుంట మండలం రామోజీపేటకు చెందిన తిరుపతయ్య స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి. 
 
అతని సహాయకుడిగా సురేష్ అనే వ్యక్తిని నియమించుకున్నాడు. పని నిమిత్తం తిరుపతయ్య ఇంటికి వెళ్ళే సురేష్ యజమాని భార్య మమతకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఇద్దరూ తిరుపతయ్యకు తెలియకుండా రాసలీలలను కొనసాగించారు. తప్పు ఎన్నో రోజులు దాగి వుండదు కదా.. ఒక్కసారిగా బయటపడింది.
 
భర్త మందలించాడు. ఆర్థికంగా మంచి ఆస్తి ఉన్న తిరుపతయ్యను ఎలాగైనా వదిలించుకుని ప్రియుడితోనే ఉండాలని నిర్ణయించుకుంది మమత. తన భర్తను చంపేయమని కోరింది. 40 వేల రూపాయలకు సుపారీ కుదుర్చుకున్న సురేష్ నలుగురు స్నేహితులతో హత్యకు ప్లాన్ చేశాడు. 
 
దీంతో ప్లాన్ ప్రకారం బుధవారం రాత్రి మమత తనకు కడుపునొప్పిగా ఉందని అర్థరాత్రి వేళ ఏడ్చింది. వెంటనే తన బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళుతుండగా సరిగ్గా మార్గమధ్యంలో సురేష్.. తన స్నేహితులతో కలిసి అతి దారుణంగా కత్తులతో తిరుపతయ్యను నరికి చంపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
 
భార్య కూడా అక్కడి నుంచి వచ్చేసినా ఉదయాన్నే స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం మమత చేసింది. కానీ పోస్టుమార్టంలో అసలు నిజాలు బయటకు రావడంతో పోలీసులు ధర్డ్ డిగ్రీ ప్రయోగించగా మమత అస్సలు విషయాన్ని బయటపెట్టింది. ప్రియుడితో పాటు మమతను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు. ఆ తరువాత సబ్ జైలుకు తరలించనున్నారు.