మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (18:36 IST)

ఆ గదిని తెరవగానే నాగుపాము, ముంగీసు అలా ఎగిరిపడ్డాయ్..

సబ్ రిజస్టర్ కార్యాలయంలో నాగుపాము, ముంగీసు కొట్లాటను చూసిన జనాలు జడుసుకుని పరుగులు తీశారు. కేరళ, ఆళప్పుయా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆళప్పుయా ప్రాంతంలో 100 ఏళ్ల పాత భవనంలో రిజి

సబ్ రిజస్టర్ కార్యాలయంలో నాగుపాము, ముంగీసు కొట్లాటను చూసిన జనాలు జడుసుకుని పరుగులు తీశారు. కేరళ, ఆళప్పుయా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆళప్పుయా ప్రాంతంలో 100 ఏళ్ల పాత భవనంలో రిజిస్టర్ ఆఫీసు కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్టర్ ఆఫీసులో ఓ ఉద్యోగి ఫైల్ కోసం ఓ గదిని తెరిచాడు. 
 
అంతే ఆ ఉద్యోగి షాకై.. పరుగులు తీశాడు. ఆ గదిలో పాము- ముంగీసు ఆవేశంగా కొట్లాడుకుంటుండగా చూసిన ఆ ఉద్యోగి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాడు. ఈ ఉద్యోగితో పాటు ఆ భవనంలోని మిగిలిన ఉద్యోగులు సైతం పామును ముంగీసును చూసి పారిపోయారు. దీంతో సమాచారం అందుకుని రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్న అటవీ శాఖాధికారులు పామును, ముంగీసును పట్టుకెళ్లారు.
 
ఆపై రిజిస్టర్ ఆఫీస్ ఉద్యోగులంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఫైల్స్ చిందరవందరగా పడిపోయాయి. ఉద్యోగుల కళ్లల్లో ఆ భయం చాలాసేపటికైనా తగ్గలేదని స్థానికులు చెప్తున్నారు.