మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (17:40 IST)

అశోక్‌ గెహ్లాట్‌కు త్వరలోనే గుణపాఠం : మాయావతి ఫైర్

తమ ఎమ్మెల్యేలను లాక్కున్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు త్వరలోనే గుణపాఠం నేర్పుతామని బీఎస్పీ అధినేత్రి మాయావతి హెచ్చరించారు. రాజస్థాన్‌ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే కాంగ్రెస్‌కు బీఎస్పీ తరపున గెలిచిన వారెవరూ ఓటు వేయకూడదని ఆమె హెచ్చరించారు.

మాయావతి మాట్లాడుతూ, ఈ అంశానికి సంబంధించి బీఎస్పీ గతంలోనే కోర్టును ఆశ్రయించిందని, అయితే కాంగ్రెస్‌ పార్టీకి, సిఎం గెహ్లాట్‌కు బుద్ధి చెప్పేందుకు తాము సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను లాక్కున్న అంశాన్ని ఇప్పుడు అంత తేలికగా వదిలేయబోమని, సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతామని అన్నారు.

గెహ్లాట్‌ తప్పులు కాంగ్రెస్‌ నేతలకు కనిపించవని, బీఎస్పీని వేలెత్తి చూపించడమే వారికి తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి షరతులు లేకుండానే కాంగ్రెస్‌కు తాము మద్దతు ప్రకటించామని, అయితే రాజ్యాంగ విరుద్ధంగా తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో కలుపుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ చేసిన ద్రోహం క్షమించలేనిదని చెప్పారు.