శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (18:01 IST)

ఐసీయూలో ఎస్​పీ బాలసుబ్రహ్మణ్యం

కరోనాతో ఆసుపత్రిలో చేరిన గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

బాలుకు కరోనా సోకినట్టు ఈనెల 5న నిర్ధరణ అయింది. అప్పటినుంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం శ్వాస సమస్య నుంచి కూడా ఆయన కోలుకున్నట్లుగా హాస్పటల్ వర్గాలు గురువారం హెల్త్ బులెటిను విడుదల చేశాయి.

అయితే గురువారం అర్థరాత్రి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించింది. నిపుణుల బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తోంది.