సంస్కృతం మాట్లాడితే కొవ్వు తగ్గిపోతుంది!
సంస్కృతం మాట్లాడితే కొవ్వు తగ్గిపోతుంది. అమ్మతోడు.. ఇది నిజం. అంటున్నారు బీజేపీకి చెందిన ఓ ఎంపీ. ఆయన పేరు గణేష్ సింగ్. ఈయన లోక్‌సభ సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు ఆసక్తికరంగా మారాయి. సంస్కృతం మాట్లాడితే షుగర్ వ్యాధి, కొవ్వు తగ్గిపోతుందని సలహా ఇచ్చారు.
ఈ విషయం అమెరికాలోని ఓ విద్యా సంస్థ చేసిన పరిశోధనలో తేలిందని సెలవిచ్చారు. సంస్కృతం మాట్లాడటం వలన నరాల వ్యవస్థను పెంచుతుందని.. దాని వలన డయాబిటిస్, కొవ్వు అదుపులో ఉంటుందని గణేష్ సింగ్ చెప్పుకొచ్చారు.
అంతేకాదండోయ్... కంప్యూటర్ ప్రోగ్రామ్‌లో సంస్కృతాన్ని ఉపయోగించినట్లైతే, అది నిరంతరాయంగా (ఆగకుండా) పని చేస్తుందట. ఈ విషయం నాసా చేసిన ఓ సర్వేలో తేలిందని గణేష్ వెల్లడించడం మరో విశేషం. ఇకపోతే, పలు ఇస్లామిక్ భాషలు సహా ప్రపంచంలోని 97శాతం భాషలు సంస్కృతం నుంచే పుట్టాయని గణేష్ వెల్లడించారు.
మరోవైపు దీనిపై కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ.. సంస్కృత భాష మాట్లాడేందుకు చాలా ఉంటుందని, అందులో ఒక్కో పదాన్ని ఎన్నో విధాలుగా వాడుకోవచ్చని తెలిపారు. బ్రదర్, కౌ అనే ఇంగ్లీష్ పదాలు కూడా ఈ భాష నుంచే పుట్టినవేనని చెప్పుకొచ్చారు.