బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (07:14 IST)

భారత్‌లో 'స్పుత్నిక్‌-వి'

రష్యా అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’తో మనుషులపై రెండు/మూడో దశల ప్రయోగ పరీక్షలను ప్రారంభించినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కో-చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.వి.ప్రసాద్‌ వెల్లడించారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని కసౌలీలో ఉన్న సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ నుంచి అనుమతులన్నీ లభించిన వెంటనే వలంటీర్లపై పరీక్షలను ప్రారంభించినట్లు తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ ట్రయల్స్‌ జరుగుతాయన్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణ కోసం తమకు రిసెర్చ్‌ భాగస్వామిగా జేఎ్‌సఎస్‌ మెడికల్‌ రిసెర్చ్‌ వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర బయోటెక్నాలజీ విభాగానికి చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌తోనూ జట్టు కట్టామని, తద్వారా వాటికి చెందిన క్లినికల్‌ ట్రయల్‌ కేంద్రాలను వాడుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు.