గురువారం, 27 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2025 (11:56 IST)

శివరాత్రి పర్వదినం : మాంసాహారం కోసం కొట్టుకున్న విద్యార్థులు

delhi versity student
మహా శివరాత్రి పర్వదినం రోజున ఏ ఒక్క హిందువు మాంసాహారం తీసుకునేందుకు ఇష్టపడరు. కానీ, ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు మాత్రం మాంసాహారం కోసం కొట్టుకున్నారు. ఏబీవీబీ, ఎస్ఎఫ్ఐ అనే రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు మాంసాహారం కోసం పోటీపడ్డారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉన్న విద్యార్థులకు మాంసాహారం వడ్డించే ప్రయత్నం చేశారని ఏబీవీపీ విభాగం నేతలు ఆరోపిస్తున్నారు. కానీ, ఏబీవీపీ విద్యార్థులే తొలుత తమపై దాడి చేశారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ గొడవ మరింత తీవ్రత కావడంతో ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గొడవ వెలుగులోకి వచ్చింది. 
 
ఢిల్లీ యూనివర్శిటీలో గొడవపై మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో మైదాన్ గర్హి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ కాల్ వచ్చినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. యూనివర్శిటీలో విద్యార్థులు గొడవ పడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. మాంసాహారం వడ్డించడంపై క్యాంటీన్‌తో తొలుత విద్యార్థుల మధ్య వాగ్వివాదం జరగడం, ఆపై వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ఈ గొడవలో గాయపడిన విద్యార్థి పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో గాయపడిన విద్యార్థిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
 
మహాశివరాత్రి రోజున మాంసాహారం వడ్డించకూడదన్న తమ ఆదేశాను కట్టుబడలేదన్న కారణంతోనే ఏబీవీపీ విద్యార్థులు తమపై దాడి చేశారని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆరోపించారు. ఏబీవీపీ గూండాలు తమపైనా, మెస్ సిబ్బందిపైనా దాడిశారని పేర్కొన్నారు. అంతేకాదు, విద్యార్థినుల జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.