Maha Shivratri 2025: తెల్లని పువ్వులతో పూజ.. అప్పులు మటాష్
భక్తులు తమ మహాశివరాత్రి పండుగను సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించడం ద్వారా ప్రారంభిస్తారు. సమీపంలోని ఆలయాన్ని సందర్శించడం లేదా ఇంట్లో శివలింగానికి ఆచార స్నానం చేయడం జరుగుతుంది.
ఇంకా ఆలయాల్లో భక్తులు శివలింగానికి తేనె, పాలు, నీరు, బిల్వపత్రాలను సమర్పిస్తారు. ఆ రోజు రాత్రి జాగరణ చేసి ఆలయాల్లో జరిగే అభిషేకాదులను కనులారా వీక్షిస్తారు. ఇంకా పంచాక్షర మంత్రం 'ఓం నమః శివాయ'ను జపిస్తూ గడుపుతారు.
శివాలయాల్లో రాత్రి పూట జరిగే అభిషేకాలను వీక్షించేవారికి సర్వశుభాలు, మోక్షం సిద్ధిస్తుంది. శివరాత్రి రోజున తెల్లని పువ్వులతో పూజించే వారికి సర్వదోషాలు, అప్పుల బాధలు వుండవు. తెల్లని పువ్వులను శివరాత్రి రోజున మహాదేవునికి అర్పించే వారికి ఆర్థిక సమస్యలంటూ వుండవు.