బుధవారం, 26 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (07:52 IST)

తెలుగు రాష్ట్రాలలో మహా శివరాత్రి వేడుకలు- ప్రయాగ్‌రాజ్‌లో ఇసుక రాలనంత జనం (video)

Maha Shivaratri
తెలుగు రాష్ట్రాలలో మహా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండే భక్తులు శివునికి ప్రార్థనలు చేయడానికి దేవాలయాలకు తరలి వస్తున్నారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట వంటి ప్రధాన దేవాలయాలు శివ నామ మంత్రాలతో మారుమోగుతున్నాయి. 
 
అలాగే మహా కుంభమేళాలో చివరి రోజు పవిత్ర స్నానం కోసం భక్తులు భారీ ఎత్తున భక్తులు ప్రయాగ్ రాజ్‌లో వున్నారు. కుంభమేళాలో భాగంగా మహా శివరాత్రి రోజు చివరి అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది చేరుకుంటున్నారు. 
Maha Kumbh Mela
Maha Kumbh Mela
 
ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా అనంతరం లక్షలాది మంది తిరుగుముఖం పట్టనున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూపీ ప్రభుత్వంతో పాటు రైల్వే శాఖ అప్రమత్తమైంది. యూపీ సర్కార్‌ 4,500 బస్సులు మోహరించగా ప్రయాగ్‌రాజ్‌ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రైల్వేశాఖ 350 రైళ్లు నడుపుతోంది.