శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (14:20 IST)

కొందరి కోసం ఇతరుల జీవించే హక్కును హరిస్తారా? సుప్రీంకోర్టు

దీపావళి పండుగ సమయంలో బాణసంచా పేల్చడాన్ని ఈ యేడాది ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. ఈ వ్యవహారం ఇపుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
టపాసుల పేల్చడంపై విధించిన నిషేధించాలని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎ.ఎస్. బోపన్నల ధర్మాసనం విచారించింది. కొందరికి ఉపాధి దొరుకుతుందని ఇతరుల జీవించే హక్కులను హరించడం మంచిదికాదని వ్యాఖ్యానించింది. అమాయకుల జీవించే హక్కును పరిరక్షించడమే తమ విధి అని పేర్కొంది.
 
బాణసంచా తయారీదారుల సంఘం కూడా తన వాదనలను వినిపించింది. దీపావళి పండుగ దగ్గరకొస్తోందని, టపాసుల విషయంలో పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రత సంస్థ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం లక్షల మంది ఉపాధి లేకుండా ఉన్నారని పేర్కొంది. 
 
అయితే, పర్యావరణానికి హాని చేయని టపాసులుంటే చెప్పాలని, వాటికి నిపుణుల కమిటీ ఆమోదం తెలిపితే అందుకు అనుగుణంగా ఆదేశాలిస్తామని తెలిపింది. దేశంలో చట్టాలున్నా వాటి అమలు కష్టతరమవుతోందని వ్యాఖ్యానించింది. కొందరు ఉపాధి కోసం ఇతరుల హక్కులను కాలరాయలేమన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది.