ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 మార్చి 2017 (11:57 IST)

ఆరు నెలలు దాటితే నో అబార్షన్: తేల్చేసిన సుప్రీం కోర్టు

గర్భవిచ్ఛిత్తికి ఆరు నెలలు దాటితే అనుమతి ఇచ్చేది లేదని అత్యున్నత న్యాయ స్థానం తేల్చేసింది. 27 వారాల గర్భస్థ శిశువుకు స్కానింగ్‌లో పలు శారీరక అవలక్షణాలున్నట్లు తేలడంతో గర్భస్రావానికి వీలు కల్పించాలని ఓ

గర్భవిచ్ఛిత్తికి ఆరు నెలలు దాటితే అనుమతి ఇచ్చేది లేదని అత్యున్నత న్యాయ స్థానం తేల్చేసింది. 27 వారాల గర్భస్థ శిశువుకు స్కానింగ్‌లో పలు శారీరక అవలక్షణాలున్నట్లు తేలడంతో గర్భస్రావానికి వీలు కల్పించాలని ఓ మహిళ పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. అయితే ఆరు నెలల దాటాక గర్భవిఛ్ఛిత్తికి అనుమతించేది లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇంకా ఈ దశలో గర్భవిచ్ఛిత్తి జరిగినా శిశువు సజీవంగానే పుడుతుందని అందిన వైద్య నివేదిక ఆధారంగా ధర్మాసనం తమ నిర్ణయం వెలువరించింది. 
 
దీనిని పరిగణనలోకి తీసుకుని ఈ మహిళకు గర్భస్రావానికి అనుమతి తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తులు ఎస్‌ఎ బొడ్బే, ఎల్ నాగేశ్వర రావుతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తల్లి ప్రాణానికి, పిండానికి ముప్పు పొంచి ఉందని తెలిసినా 20 వారాల గర్భం తరువాతి దశలో గర్భవిచ్ఛిత్తిని నిషేధిస్తూ చట్టం అమలులో ఉన్న నేపథ్యంలో.. 27వారాలు దాటిన గర్భస్థ శిశువు విచ్ఛిత్తికి అనుమతి ఇచ్చేది లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.