బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (13:22 IST)

చైల్డ్ ఫోర్నోగ్రఫీ, గ్యాంగ్‌రేప్ వీడియోల అప్‌లోడింగ్‌: గూగుల్, ఫేస్‌బుక్‌లకు సుప్రీం ఆదేశాలు

చైల్డ్ ఫోర్నోగ్రఫీ, రేప్, గ్యాంగ్‌‌రేప్ వీడియోల అప్‌లోడింగ్‌కు సంబంధించిన ఫిర్యాదుల వివరాలపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఇంటర్నెట్ దిగ్గజాలు, గూగుల్

చైల్డ్ ఫోర్నోగ్రఫీ, రేప్, గ్యాంగ్‌‌రేప్ వీడియోల అప్‌లోడింగ్‌కు సంబంధించిన ఫిర్యాదుల వివరాలపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఇంటర్నెట్ దిగ్గజాలు, గూగుల్, యాహూ, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌లకు సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
గత ఏడాది నుంచి ఈ ఏడాది ఆగస్టు 31వరకు అందుకున్న ఫిర్యాదుల వివరాలు, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను తమకు తెలపాల్సిందిగా సుప్రీం కోర్టు కోరింది. హైదరాబాద్‌కు చెందిన ఎన్జీఓ ప్రజ్వల అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తుకు లేఖ రాస్తూ రెండు రేప్ వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌ను పంపించింది. దీనిని విచారణకు చేపట్టిన కోర్టు వాట్సాప్‌లో ఆ వీడియోలు అప్‌లోడ్ చేసిన వారిని గుర్తించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. 
 
సోషల్ సైట్లలో అభ్యంతరకర వీడియోలను బ్లాక్ చేయడానికి ఉన్న సాంకేతిక పరిష్కారాలను పరిశీలించేందుకు ఏర్పాటైన కేంద్ర, ఇంటర్నెట్ సంస్థల ప్రతినిధులతో కూడిన కమిటీ సోమవారం జరిగిన ఈ కేసు విచారణకు హాజరైంది. పబ్లిక్ డొమైన్‌ వివరాలు ఇచ్చేందుకు ఆయా సైట్ల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన కోర్టు సంబంధిత వివరాలు ఇవ్వాల్సిందేనని ఇంటర్నెట్ దిగ్గజాలకు ఆదేశాలు జారీ చేసింది.