శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 మార్చి 2017 (10:19 IST)

పోర్న్ సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి : సుప్రీం కోర్టు ఆదేశాలు

పోర్న్ సైట్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఫోర్న్ సైట్ల సంఖ్య కూడా పెరిగిపోయింది. వీటిని బ్లాక్ చేయాలని ఎప్పటి నుండో డిమాండ్ ఉ

పోర్న్ సైట్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఫోర్న్ సైట్ల సంఖ్య కూడా పెరిగిపోయింది. వీటిని బ్లాక్ చేయాలని ఎప్పటి నుండో డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు వేలకు పైగా ఫోర్న్ సైట్లను బ్లాక్ చేసింది.
 
ఇంకా లోక్ సభలో కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలిపింది. ఐటీ చట్టం, 2000 ప్రకారం అభ్యంతరకరమైన ఆన్ లైన్ కంటెంట్‌ను తొలగించవచ్చు. ఇలాంటి వాటిపై నిరంతరం అప్రమత్తంగా ఉన్నట్టు ఐటీ మంత్రిత్వశాఖ పేర్కొంది.
 
ఛైల్డ్ ఫోర్నోగ్రఫిక్ వెబ్ సైట్లు భారత్ వెలుపలివేనని ఐటీ శాఖ పేర్కొంది. ఈ వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను బ్లాక్ చేశామని హోంమంత్రిత్వశాఖ పేర్కొంది. మహిళలు, పిల్లలు సైబర్ క్రైమ్ బారినపడకుండా అడ్డుకునేందుకుగాను కేంద్ర హోంశాఖ ప్రత్యేక చర్యలు తీసుకొంటోదని కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ప్రకటించింది.