సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (10:03 IST)

మే 14 నుంచి జూన్‌ 30 వరకూ సుప్రీం సెలవులు

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది సుప్రీంకోర్టు వేసవి సెలవులు వారం రోజులు ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సుప్రీంకోర్టు అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సోమవారం సీజేఐ ఎన్వీ రమణ సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా వారం రోజుల ముందుగానే సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించాలన్న ఆయా ప్రతినిధుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తానని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. 
 
అయితే, తుది నిర్ణయం ఫుల్‌ కోర్టు తీసుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టు క్యాలెండర్‌ ప్రకారం వేసవి సెలవులు మే 14 నుంచి జూన్‌ 30 వరకూ ఉండాలి. దీన్ని వారం రోజులు ముందుకు జరిపి మే 8 నుంచి జూన్‌ 27 వరకు వేసవి సెలవులు ప్రకటించాలని బార్‌ అసోసియేషన్‌ కోరింది.