శుక్రవారం, 17 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 4 మే 2017 (09:40 IST)

భార్య ఉంది.. అయినా రెండో భార్య కావాలట... వద్దన్న తల్లి... ఒంటిపై కారం చల్లి చంపేసిన హెడ్మాస్టర్

తమిళనాడు రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. మొదటి భార్య ఉండగా, రెండో పెళ్లికి సిద్ధమైన ఓ ప్రధానోపాధ్యాయుడిని తల్లి వారించింది. దీంతో ఆగ్రహించిన ఆ కసాయి హెడ్మాస్టర్.. తల్లినే చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్

తమిళనాడు రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. మొదటి భార్య ఉండగా, రెండో పెళ్లికి సిద్ధమైన ఓ ప్రధానోపాధ్యాయుడిని తల్లి వారించింది. దీంతో ఆగ్రహించిన ఆ కసాయి హెడ్మాస్టర్.. తల్లినే చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
తంజావూరులోని శ్రీనివాసపురంలో ప్రభుత్వ పాఠశాలలో కె.త్యాగరాజన్‌ (57) ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మొదటి భార్యతో తరచూ గొడవలు ఏర్పడుతుండటంతో వారిద్దరి మధ్య సయోధ్య ఉండేది కాదు. దీంతో రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన తల్లివద్ద చెప్పగా ఆమె అంగీకరించలేదు. 
 
ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న త్యాగరాజన్.. ఏప్రిల్‌ 20న ఆమె ఒంటి మీద కారం చల్లి, ఆరు సవర్ల నగలు అపహరించి హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టుగా తల్లి మృతి చెందిందని, నగలు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. త్యాగరాజన్‌ ప్రవర్తనలో తేడాను గమనించిన ప్రత్యేక పోలీసులు అనుమానంతో మంగళవారం అతడిని విచారించగా అసలు విషయం బయటపడింది. రెండో వివాహానికి తల్లి అంగీకరించకపోవడంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడ్ని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.