మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (17:22 IST)

సముద్రంలో మునిగిపోయిన తెలుగు విద్యార్థుల గల్లంతు

Mahabalipuram
Mahabalipuram
తమిళనాడులోని మహాబలిపురం సముద్రంలో ముగ్గురు తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ముగ్గురూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు కావడం గమనార్హం. కాలేజీ తరపున 18 మంది విద్యార్థుల బృందం తమిళనాడు టూర్‌కి వెళ్లింది. 
 
మహాబలిపురంలో సరదాగా ఈత కోసం విద్యార్థులు సముద్రంలోకి దిగారు. ఈ సందర్భంగా విజయ్, ప్రభు, మౌనిష్ అనే విద్యార్థులు గల్లంతయ్యారు. 
 
గల్లంతైన విద్యార్థుల కోసం గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు. గల్లంతు సమాచారంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.