బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 జులై 2017 (15:43 IST)

ఐదుసార్లు వివాహం చేసుకున్నాడు.. ఆరో పెళ్లికి సిద్ధమయ్యాడు.. చివరికి దొరికిపోయాడు..

ఐదు సార్లు వివాహం చేసుకున్నాడు. ఆరో మహిళతో వివాహానికి సిద్ధమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెకు వివాహం చేయాలని భావించాడు. ఇందుకోసం సంబంధాల

ఐదు సార్లు వివాహం చేసుకున్నాడు. ఆరో మహిళతో వివాహానికి సిద్ధమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెకు వివాహం చేయాలని భావించాడు. ఇందుకోసం సంబంధాలు వెతికాడు. ఆ సమయంలో ఆయనకు 32ఏళ్ల ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నానని.. చేతినిండా సంపాదిస్తున్నానని గొప్పలు చెప్పుకున్నాడు.
 
ట్రావెల్ ఏజెన్సీ కూడా నడుపుతున్నట్లు నమ్మించాడు. దీన్ని నమ్మిన ఆ తండ్రి.. తన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేయాలనుకున్నాడు. వీరిద్దరి వివాహం డిసెంబరులో జరగాల్సి వుంది. అయితే కావలసిన డబ్బు అందకపోవడంతో వివాహం వాయిదా పడుతూ వచ్చింది. ఆ సమయంలో వధువు తరపు వారికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అందులో వరుడు మంచివాడు కాడని, అతనికి ఇప్పటికే ఐదుసార్లు వివాహం జరిగిందని ఎవరో చెప్పడంతో వధువు తండ్రి షాక్ అయ్యాడు.
 
దీనిపై కాబోయే అల్లుడిని వధువు తండ్రి నిలదీస్తే అలాంటిది ఏదీ జరగనట్లు సమాధానమిచ్చాడు. అయితే కొద్దిరోజుల క్రితం ఐదుగురు మహిళలు వధువు తండ్రి వద్దకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లగక్కారు. దీంతో ఆవేశానికి గురైన వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఐదుసార్లు వివాహం చేసుకున్న కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.