ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 జులై 2024 (21:06 IST)

ఆ చిన్నారి స్వచ్ఛమైన సంతోషం, ఆనందంగా వీడ్కోలు చెబుతూ (video)

saying goodbye to the loco pilot
పిల్లలూ దేవుడూ చల్లనివారే... కల్లకపటమెరుగుని కరుణామయులే అనే పాటను మనం వింటూ వుంటాము. అలాగే చిన్నారులు చేసే చిన్నిచిన్ని పనులు ఎంతో ముద్దుగా పట్టలేనంత సంతోషాన్ని నింపుతుంటాయి.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఫ్లాట్‌ఫామ్ నుంచి ఓ రైలు మెల్లగా కదులుతోంది. రైలు మార్గానికి కాస్తంత దూరంలో తన చిన్నారి మనవరాలిని ఎత్తుకుని ఓ తాత రైలును చూపిస్తున్నారు. ఆ పాపాయి లోకో రైలు పైలట్ పచ్చజెండా ఊపుతూ రైలుకి సిగ్నల్ ఇస్తుండగా చూస్తూ తను కూడా ఎంతో సంతోషంగా చేయిని ఊపుతూ వీడ్కోలు చెబుతోంది. ఆ దృశ్యం చూడముచ్చటగా వుంది. ఈ వీడియోను దక్షిణమధ్య రైల్వే తన అధికారిక ట్విట్టర్ పేజీలో పంచుకున్నది. మీరు కూడా చూడండి.