గురువారం, 7 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 జులై 2024 (18:51 IST)

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej
ఈ మధ్య కొందరు తెలుగు యూట్యూబ‌ర్స్ చిన్న పిల్ల‌ల వీడియోలపై కామెంట్స్ చేసిన వీడియో వివాదాస్పదం అయింది. హనుమంతు అనే పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ ర‌న్ చేస్తున్న ఒక తెలుగు యూట్యూబ‌ర్ త‌న ఛాన‌ల్‌లో త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి లైవ్ వీడియోస్‌కి రియాక్ష‌న్ ఇవ్వ‌డం  చేస్తుంటాడు. అయితే త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ఒక వ్లాగ్ చేస్తూ.. చిన్న‌పిల్ల‌ల‌పై  లైంగిక కామెంట్లు చేశారు. దీంతో ఈ వీడియో కాంట్రావ‌ర్సీగా మారింది. ఈ విష‌యంపై నెటిజ‌న్ల‌తో పాటు టాలీవుడ్ న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎక్స్ వేదిక‌గా స్పందించాడు.
 
సోషల్ మీడియాను ఎక్కువ‌గా వాడే తల్లిదండ్రులకు సాయి తేజ్‌ తాజాగా ఓ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా చాలా క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయింది. 
 
దయచేసి జాగ్రత్తగా ఉండండి. కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. పొరపాటున ఒక్క పోస్ట్ పెడితే చాలు దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ పిల్లల ఫోటోలు, లేదా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి.. కొంతమంది మీ పిల్ల‌లపై చేసే కామెంట్స్ చూసి మీరు తట్టుకోలేరు. 
 
మిమ్మల్ని ఎంతగానో బాధపెడతాయి ఆ కామెంట్స్.. మీ పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్ చేయకపోవడం మంచిది అని నా భావన. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు తేజ్. ఈ పోస్ట్‌కు తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంల‌తో పాటు తెలంగాణ డీజీపీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం, ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీ ఎక్స్ ఖాతాల‌ను ట్యాగ్ చేశాడు.
 
అయితే ఈ పోస్ట్‌పై తాజాగా తెలంగాణ సిఎం‌ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ స్పందించారు‌. సాయి తేజ్ పోస్ట్‌కు స్పందిస్తూ..  క్లిష్టమైన ఈ సమస్యను లేవనెత్తినందుకు, తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 
Sai Dharam Tej
Sai Dharam Tej
 
పిల్లల భద్రత అనేది అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విష‌యం. తెలంగాణా ప్రభుతం పిల్లల పట్ల జరుగుతున్న అఘాయిత్యాల పట్ల, సోషల్ మీడియాలో ఇలాంటి పనులు చేస్తున్న‌ వాళ్ళ పట్ల జరుగుతున్న ఘోరమైన విషయాల పట్ల కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. పిల్లలకు సురక్షితమైన ఆన్‌లైన్ ప్రపంచాన్ని సృష్టించడానికి అంద‌రం కలిసి పని చేద్దాం అంటూ రిప్లై ఇచ్చారు.