బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 జులై 2024 (14:55 IST)

సంగారెడ్డిలో బాలుడిపై వీధి కుక్కల స్వైర విహారం.. (Video)

street dogs
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలోని వీధుల్లో స్వైర కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఓ వీధిలో ఆడుకుంటున్న చిన్నపిల్లవాడిపై వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. నాలుగైదు కుక్కలు ఆ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో రక్తపు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, చిన్నపిల్లాడిపై వీధి కుక్కలు దాడి చేయడాన్ని గమనించిన స్థానిక వ్యక్తి ఒకరు ఆ కుక్కల దాడి నుంచి బాలుడి ప్రాణాలు రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.