బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (11:43 IST)

కశ్మీర్​ స్థానిక ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్​

త్వరలో జరగనున్న జమ్ముకశ్మీర్​ స్థానిక ఎన్నికలను కాంగ్రెస్​ బహిష్కరించింది. రాష్ట్ర యంత్రాంగ ధోరణి, సీనియర్​ నేతల గృహ నిర్బంధాలు కొనసాగుతుండటమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

కశ్మీర్​ స్థానిక ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్​ఈ నెల 24న జమ్ముకశ్మీర్​లో జరగనున్న బ్లాక్​ అభివృద్ధి మండలి(బీడీసీ) ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్​ ప్రకటించింది. మొట్టమొదటి సారిగా జరగనున్న ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తొలుత ప్రకటించింది హస్తం పార్టీ.

కానీ రాష్ట్ర యంత్రాంగ వైఖరి, ఆర్టికల్​ 370 రద్దు అనంతరం సీనియర్​ నేతల గృహ నిర్బంధాలను కొనసాగిస్తుండటం వల్ల బీడీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయాలని కాంగ్రెస్​ విశ్వసిస్తుంది. ఎలాంటి ఎన్నికలకైనా కాంగ్రెస్​ ఎప్పుడూ సిద్ధమే.

కానీ రాష్ట్ర రాజ్యాంగ పాలన, సీనియర్​ నేతల గృహ నిర్బంధాల వల్ల బీడీసీ ఎన్నికలను కాంగ్రెస్​ బహిష్కరిస్తోందని జమ్ముకశ్మీర్ కాంగ్రెస్​​ చీఫ్​ గులామ్​ అహ్మద్​ తెలిపారు.