గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (16:37 IST)

క్షుద్రపూజలు చేస్తున్నాడని తల నరికి.. తలతో ఊరంతా తిరిగాడు

murder
క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడు తన మేనమామను దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో నరికి తల, మొండాన్ని వేరు చేశాడు. ఆ తర్వాత తలను చేతిలో పట్టుకొని ఊరంతా తిరిగాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లా కరమాటి గ్రామంలో జరిగింది. నిందితుడిని రవీంద్ర సింగ్ గౌర్ (26)గా గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే.. కొన్ని సంవత్సరాల క్రితం రవీంద్ర సింగ్ తండ్రి చనిపోయాడు. తన తండ్రి చావుకు మేనమామ మక్సుదన్ సింగ్ కౌర్ (60) కారణమంటూ రవీంద్ర ఆరోపించేవాడు. 
 
క్షుద్రపూజలు చేయడం వల్లే తండ్రి మరణించాడని చెప్పేవాడు. ఈ క్రమంలోనే ముక్సుదన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని గతంలోనే సవాల్ విసిరాడు. ఈ క్రమంలోనే హత్యకు పాల్పడ్డాడు. నిందితుడిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.