సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (16:38 IST)

ఆంటీ.. అని పిలిచినందుకు అమ్మాయిని చితకబాదిన మహిళ, ఎక్కడ?

ఆంటీ.. అని పిలిచినందుకు అందరి ముందర ఆ అమ్మాయిని చితకబాదింది ఓ మహిళ. దీంతో అక్కడి వారంతా కలిసి ఆ మ్మాయిని కాపాడారు. ఉత్తరప్రదేశ్ లోని ఎటాలో కరవాచౌత్‌లో ఓ పూజా సామగ్రి దుకాణం వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కొందరు తమ స్మార్ట్ ఫోన్లో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
 
ఎటాలోని బాబూగంజ్ మార్కెట్లో పూజా సామగ్రీని అమ్ముతారు. వాటిని కొనుగోలు చేయడానికి పలువురు మహిళలు వచ్చిన నేపథ్యంలో అక్కడే ఉన్న యువతి వారిలో ఒకరిని ఆంటీ.. అని పిలవడంతో ఈ గొడవ చెలరేగింది. నన్ను ఆంటీ అని పిలుస్తావా అని ఆమె రెచ్చిపోయింది. ఆ యువతిని జుట్టుపట్టుకుని కొట్టింది.
 
ఆమెతో ఉన్న మరికొందరు కూడా అమ్మాయిని తలో దెబ్బ వేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తను సదరు మహిళను ఆంటీ అని పిలవడంతో ఆమె తనను కొట్టిందని ఆ యువతి పోలీసులకు చెప్పింది. అందులో తప్పేముందో తనకు అర్థం కాలేదని వాపోయింది.