నీ అంత అందగత్తె ఎవరూ లేరనేసరికి లొంగిపోయింది, మూడుసార్లు అబార్షన్ చేయించాడు
ఆమె అందమే ఆమెకు శాపంగా మారింది. అందంగా ఉన్నావని ఎవరైనా పొగిడితే పడిపోవడం కొందరి బలహీనత. అలాంటి బలహీనతలో పడిపోయింది ఆ యువతి. ఆ వీక్‌నెస్ చివరకు ఆమె జీవితాన్ని నాశనం చేసేసింది. ఒక యువకుడిని నమ్మి మోసపోయింది. శారీరకంగా వాడుకున్న ఆ యువకుడు ఇప్పుడు పెళ్ళి చేసుకోనని తేల్చి చెబుతున్నాడు.
కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో ఉన్న టిన్ ఫ్యాక్టరీరీకి సమీపంలో నివాసముంటున్నారు జ్యోతి, ఆమె భర్త, కుమారుడు వర్మ. జ్యోతి కాలేజీ ప్రొఫెసర్. సాయంత్రం వేళల్లో ట్యూషన్ ఇంటి దగ్గరే చెబుతూ ఉంటోంది. ఇంటర్ విద్యార్థినులకు క్లాసులకు చెప్పే జ్యోతి తన ఇంటి వద్దకు విద్యార్థినుల పిలిపించుకుని క్లాసులను చెబుతూ ఉండేది.
అయితే సరిగ్గా రెండు సంవత్సరాల నుంచి జ్యోతి ఇంటికి వచ్చే ఒక యువతిపై కన్నేశాడు ఆమె కుమారుడు వర్మ. డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి ఆకతాయిగా తిరుగుతున్నాడు. వర్మ చెప్పే మాటలకు ఆ యువతి పడిపోయింది. దీంతో ఒకటినర్న సంవత్సరం నుంచి ఆమెను శారీరకంగా వాడుకుంటున్నాడు వర్మ.
నువ్వు చాలా అందగత్తెవు. నీ అంత అందం బహుశా ప్రపంచంలోనే ఉండదు. నీ అందం అలాంటిదిలాంటిది కాదు.. ఇలా ఎన్నో మాటలు చెబితే ఆమె అతడికి లొంగిపోయింది. ఇలా వర్మ ఆమెను శారీరకంగా వాడుకోవడమే కాకుండా మూడుసార్లు అబార్షన్ కూడా చేయించాడు.
అయితే ఇంటిలో ఆ విషయం చెప్పకుండా ఉన్న యువతి వర్మనే పెళ్ళి చేసుకోవాలనుకుంది. పెళ్ళి అనే మాట వినేసరికి వర్మకు కోపమొచ్చింది. ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. అసలు విషయం చెప్పేసింది. అబార్షన్ చేయించుకున్న కాగితాలను పోలీసులకు చూపించింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.