గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (05:27 IST)

మధ్య ప్రదేశ్‌లో వెయ్యి మంది టీచర్లు రాజీనామా

మధ్య ప్రదేశ్‌లోని ఆరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలలో పని చేసే వెయ్యి మంది టీచర్లు గురువారం రాజీనామా చేశారు. ఒక స్పష్టమైన పదోన్నతి విధానం కావాలన్న డిమాండ్‌తో వీరు రాజీనామా చేసినట్లు మెడికల్‌ కాలేజీ టీచర్ల యూనియన్‌ ప్రతినిథులు తెలిపారు.

వీరెవరూ ఈ నెల 9 నుంచి విధులకు హాజరు కాబోరని పేర్కొన్నారు. మిగిలిన 2,300 మంది టీచర్లు కూడా శుక్రవారం తమ రాజీనామాలు సమర్పిస్తారని భావిస్తున్నట్లు యూనియన్‌ కార్యదర్శి తెలిపారు.

ఒక స్పష్టమైన పదోన్నతి విధానంతో ప్రభుత్వం ముందుకు రావాలని, అలాగే 7వ వేతన సంఘం మేరకు వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.