శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (08:36 IST)

ఐఎన్ఎస్ రణ్‌వీర్ నౌకలో అగ్నిప్రమాదం - ముగ్గురి మృతి

ముంబై డక్ యార్డులో ఓ విషాద సంఘటన జరిగింది. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్‌వీర్ డిస్ట్రాయర్ నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నౌకాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ నౌకలో ఉన్నట్టుండి పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
మీడియా కథనాల మేరకు ఐఎన్ఎస్ రణ్‌వీర్ ఇంటర్నెల్ కంపార్ట్‌మెంట్‌లో ఈ పేలుడు సంభవించింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆస్తి నష్టం పెద్దగా సంభవించలేదు. 
 
ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ పేలుడు గల కారణాలు తెలియాల్సివుంది. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఓడలోని సిబ్బంది తక్షణం స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.