శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (17:44 IST)

కాంగ్రెస్ దొంగే... బీజేపీ అంతకుమించిన గజదొంగ : హార్దిక్ పటేల్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల తేదీలను వెల్లడించాల్సి ఉండగా, ఎన్నికల సంఘం జాప్యం చేస్తోంది. దీనిపై రాజకీయ దుమారం చెలరేగివుంది. ఈ క్రమంలో పటీదార్ ఉద్యమ సంచలనం హార్దిక్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల తేదీలను వెల్లడించాల్సి ఉండగా, ఎన్నికల సంఘం జాప్యం చేస్తోంది. దీనిపై రాజకీయ దుమారం చెలరేగివుంది. ఈ క్రమంలో పటీదార్ ఉద్యమ సంచలనం హార్దిక్ పటేల్ తాజాగా మరోసారి నోటికి పనిచెప్పారు. 'పెద్దదొంగ' బీజేపీని గద్దెదించడం కోసం 'చిన్నదొంగ' కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
ఉత్తర గుజరాత్‌లోని మందల్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 'కాంగ్రెస్ దొంగే... కానీ బీజేపీ అంతకు మించిన గజదొంగ. అందుకే గజదొంగను ఓడించేందుకు దొంగకి మద్దతు ఇవ్వాల్సి వస్తే.. మేము అందుకు సిద్ధం. అయితే ఇక్కడ కొంత సంయమనం పాటించాలి. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు మద్దతివ్వం...' అంటూ వ్యాఖ్యానించారు. 
 
అదేసమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో తాను సమావేశమైనట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను రాహుల్ గాంధీ బసచేసిన ఉమ్మెద్ హోటల్‌లోనే ఉన్నప్పటికీ.. రాహుల్‌ని కలుసుకోలేదని వివరించారు. అయితే బీజేపీ వాళ్లు మాత్రం గుజరాత్ మొత్తం తమ సొత్తు అయినట్టు సీసీటీవీ వీడియోలతో హడావిడి చేస్తున్నారంటూ మండిపడ్డారు.