శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (17:28 IST)

జవాన్లపై ఉగ్రపంజా... 18 మంది దుర్మరణం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా అవంతిపురాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఫలితంగా 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. 
 
కొంతమంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో కూడిన వాహనం శ్రీనగర్ వెళ్తుండగా కారులో దూసుకొచ్చిన మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొట్టారు. వెంటనే ఐఈడీ బాంబును పేల్చడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘటనలో మరో 13 మంది గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.