గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (11:01 IST)

16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపేశాడు.. ఆపై గొంతు కోసుకున్నాడు..

crime
త్రిపురలో ఓ యువకుడు కిరాతకుడిగా మారాడు. 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హతమార్చాడు. అదే కత్తితో గొంతుకోసుకున్నాడు. ఉత్తర త్రిపుర జిల్లాలోని కంచన్‌పూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న హత్యకు గురైన బాలికతో కార్తీక్ దేబ్‌నాథ్ అనే యువకుడికి ప్రేమ వ్యవహారం ఉందని పోలీసు అధికారి తెలిపారు.
 
బాలిక ఒంటరిగా తన పాఠశాలకు వెళుతున్నప్పుడు, దేబ్‌నాథ్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో బాలుడు గొంతు కోసుకున్నాడు. ఆపై స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే బాలిక మార్గమధ్యంలోనే మృతి చెందింది. 
 
తీవ్రంగా గాయపడిన కళాశాల విద్యార్థి దేబ్‌నాథ్‌ను ధర్మనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అతను కూడా చికిత్స పొందుతూ మరణించాడు. పట్టపగలు జరిగిన ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.