గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (08:32 IST)

షోఫియాన్‌లో ఇద్దరు లష్కర్ ముష్కరుల అరెస్టు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని షోఫియాన్‌లో లష్కర్ రే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను భారత భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. కాశ్మీర్‌, షోఫియాన్ జిల్లాలో రాంబీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగివున్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకున్న సైనిక బలగాల కన్నుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, భద్రతా బలగాలు చాకచక్యంగా వారిని అరెస్టు చేశాయి. 
 
సైనికులు అరెస్టు చేసిన తీవ్రవాదులను షాహిద్ అహ్మద్, కిఫాయత్ ఆయూబ్ ఆలీగా గుర్తించారు. వీరి నుంచి చైనాలో తయారైన పిస్తోలుతో పాటు... ఆయుధ సామాగ్రి, పిస్తోల్ మ్యాగజైన్, రెండు చైనీస్ హ్యాండ్ గ్రనైడ్లు, ఎనిమిది రౌండ్ల బుల్లెట్లు, రూ.2.9 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.