మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (14:17 IST)

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల మృతి

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. దీంతో శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
 
కాశ్మీర్ శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమారంతో స్థానిక పోలీసులతో కలిసి సీఆర్‌పీఎఫ్‌ దళాలు గాలింపు చేపట్టాయి. 
 
ఈ క్రమంలో ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో ప్రతిగా భద్రతా బలగాల కాల్పులు జరిగింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారిని లష్కరే తొయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.