బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (13:28 IST)

స‌క్సెస్ కోసం త‌పిస్తున్న గోపీచంద్ ల‌క్ష్యం2 టార్గెట్‌!

Gopichand
జ‌యం సినిమాలో విల‌న్‌గా చేసిన గోపీచంద్ ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో హీరోగా చేశాడు. అయితే ఆయ‌కు ఏదీ స‌రైన హిట్ అందించ‌లేక‌పోయింది. క‌రోనా స‌మ‌యంలో ఆర‌డుగుల బుల్లెట్ సినిమా విడుద‌లై ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఈ త‌ర్వాత ఆయ‌న మారుతీ ద‌ర్శ‌కత్వంలో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే సినిమా చేశాడు. అది పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. కానీ ఇప్పుడు అన్నీ అగ్ర హీరోల సినిమాలు విడుద‌ల‌కు రెడీ కావ‌డంతో దానిని మారుతీ కాస్త విడుద‌ల‌కు గేప్ ఇచ్చాడు.
 
అయితే గోపీచంద్‌కు స‌రైన హిట్ లేదు. దాని కోసం చాలా క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్యం అనే సినిమా చేశాడు. ఆ త‌ర్వాత శౌర్యం చేశాడు. ల‌క్ష్యం సినిమాపై ఆయ‌న న‌మ్మ‌కం వుంది. అందులో అన్ని సెంటిమెంట్లు వున్నాయి. వినోదం కూడా వుంది. ఇప్పుడు ఆ త‌ర‌హాలో ఓ సినిమా శ్రీ‌వాస్‌తో చేస్తున్నాడు. ఇటీవ‌లే సెట్‌పైకి వెళ్ళింది. దానికి వ‌ర్కింగ్ టైటిల్‌గా ల‌క్ష్యం2 అని పెట్టారు. మ‌రి సెంటిమెంట్‌గా బాగుంద‌ని పెట్టారో, చివ‌రికి ఆ టైటిల్ ఖ‌రారు చేస్తారో చూడాలి.