శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (13:25 IST)

కర్ణాటకలో దారుణం.. తొమ్మిది వేల కోసం హత్య

murder
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. కేవలం తొమ్మిది వేల కోసం ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు. అందరూ చూస్తుండగానే రోడ్డుపైనే కత్తితో దాడి చేసి హతమార్చాడు. అప్పుగా ఇచ్చిన మొత్తం చెల్లించకపోవడంతో హత్య చేశారు నిందితులు. ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
 
పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని కలబురిగిలో రద్దీగా ఉండే రోడ్డుపైనే ఓ వ్యక్తిని ఇద్దరు అత్యంత దారుణంగా పొడిచి చంపారు. కలబురిగికి చెందిన జమీర్ తనకు తెలిసిన సమీర్ నుంచి రూ. 9,000 అప్పుగా తీసుకున్నాడు. అయితే కొంత కాలంగా జమీర్‌ని తన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా జమీర్ కోరుతున్నాడు. 
 
అయితే అప్పటి నుంచి జమీర్ తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శనివారం జమీర్ కలబురిగిలోని జేవర్గి రోడ్డు దాటుతుండగా.. సమీర్ తన స్నేహితుడు ఆకాశ్‌తో కలిసి పదునైన ఆయుధంతో దాడి చేశారు.
 
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.