గూగుల్ సంచలన నిర్ణయం.. 2వేల లోన్స్ యాప్స్‌కు చెక్
గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో లోన్స్ అందించే యాప్స్‌ను తొలగించే పనిలో ఉంది గూగుల్. ఇలా లోన్స్ అందించే 2వేలకుపైగా యాప్స్‌లను తొలగించింది గూగుల్.
సమాచారాన్ని తప్పుగా చూపించడం, ఆఫ్‌లైన్‌లో ఈ యాప్స్ పనితీరు కారణంగా వాటిపై చర్యలు చేపట్టినట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి యాప్స్‌పై రానున్న రోజుల్లో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని భావిస్తోంది.
ఈ సందర్భంగా గూగుల్ సీనియర్ డైరెక్టర్, ఆసియా పసిఫిక్ ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ హెడ్ సైకత్ మిత్రా మాట్లాడుతూ.. జనవరి నుండి భారతదేశంలోని ప్లే స్టోర్ నుండి రుణాలు అందించే 2,000 కంటే ఎక్కువ యాప్‌లను తొలగించినట్లు మిత్రా తెలిపారు.
అంతకుముందు దేశంలోని దిగ్గజం టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ గత నెలలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌కు ఒక్కో షేరు ధర రూ.734 చొప్పున 71 మిలియన్లకు పైగా ఈక్విటీ షేర్లను కేటాయించింది.