గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (09:48 IST)

ఆగస్టు 27న విద్యా సంస్థలకు సెలవు దినం

schools kids
ఏపీలో ఆగస్టు 27న విద్యా సంస్థలకు సెలవు దినం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ సిబ్బంది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతూ పూర్తి స్థాయిలో పనిచేశాయి. ఆగస్టు 13న రెండో శనివారం సెలవు దినమైనప్పటికీ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్భంగా సెలవు తీసుకోలేదు. 
 
ఈ కారణంగానే తాజాగా ఏపీ సర్కారు రెండో శనివారానికి బదులుగా ఈ నెలలో వస్తున్న నాలుగో శనివారమైన ఆగస్టు 27 సెలవుగా ప్రకటిస్తున్నట్టు ఏపీ విద్యా శాఖ స్పష్టం చేసింది.