గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (17:10 IST)

వైఎస్సార్ చేయూత.. అర్హతలు ఇవే.. అకౌంట్లోకి రూ.18,750వేలు

ys jagan
45 ఏళ్లు నిండిన మహిళలకు 'వైఎస్సార్‌ చేయూత' పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ఏపీ సర్కారు సిద్ధం అవుతోంది.   ఈ ఏడాది ఆగస్టు 12 నాటికి 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ పథకానికి అర్హులు. ఒక్కొక్కరికి రూ.18,750లను అర్హులకు అందజేస్తారు.
 
ప్రస్తుతం అర్హుల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పేర్ల నమోదుకు క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్, ఆధార్‌ తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలలో 45-60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరుతో ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందజేస్తోంది. సెప్టెంబర్‌ 5 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ దరఖాస్తులపై సెప్టెంబర్ 8 లోగా సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోల ఆధ్వర్యంలో పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తిస్తారు.
 
చేయూత పథకం ద్వారా 2020 ఆగస్టులో.. తొలి విడత కింద 24,00,111 మందికి రూ.4,500.21 కోట్లు.. 2022 జూన్‌ 22న రెండో విడతగా 24,95,714 మందికి రూ.4,679.49 కోట్లు అకౌంట్‌లలో జమ చేశారు. మూడో విడతగా సెప్టెంబర్‌లో లబ్ధిదారులకు రూ.18,750 చొప్పున అకౌంట్‌లో జమ చేస్తారు.